1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:42,251 --> 00:00:46,004
మీ అలంకరణలన్నీ క్రిస్మస్ చెట్టు మీద చాలా అందంగా కనిపిస్తాయి.

4
00:00:46,588 --> 00:00:50,050
కట్ చేయడంలో ఎవరికైనా సాయం కావాలంటే, చేయి పైకెత్తండి, సరేనా?

5
00:00:58,851 --> 00:01:00,727
అందరూ చాలా బాగా చేశారు.

6
00:01:01,562 --> 00:01:05,190
విలియమ్, స్కూల్ లో ఇదే నీ చివరి రోజు కాబట్టి

7
00:01:05,190 --> 00:01:08,068
ఇక్కడికి వచ్చి ఏం చేశావో అందరికీ చూపించు.

8
00:01:11,822 --> 00:01:12,990
సిగ్గు పడకు.

9
00:01:16,034 --> 00:01:17,286
వచ్చి చూపించు.

10
00:01:17,911 --> 00:01:18,912
వెళ్ళు.

11
00:01:36,180 --> 00:01:37,931
అదరగొట్టేశావు, విలియమ్.

12
00:01:37,931 --> 00:01:41,435
నువ్వు చేసిన ఈ కొత్త అలంకరణని
అందరి కన్నా ముందు చెట్టు మీద నువ్వే పెట్టు.

13
00:01:41,435 --> 00:01:42,686
అందరూ రండి.

14
00:02:00,913 --> 00:02:05,626
"కొంగ రెట్ట వేసింది,
కానీ ఆ రెట్ట నేల మీద ఎందుకు పడలేదు?"

15
00:02:05,626 --> 00:02:07,503
ఏమో మరి. ఎందుకు?

16
00:02:07,503 --> 00:02:09,630
ఎందుకంటే ఆ కొంగ డైపర్ వేసుకొని ఉంది.

17
00:02:11,548 --> 00:02:12,549
విలియమ్.

18
00:02:15,636 --> 00:02:17,095
మీ కొత్త ఇంట్లో అంతా మీకు మంచే జరగాలి.

19
00:02:17,679 --> 00:02:18,931
మేము నిన్ను మిస్ అవుతాం.

20
00:02:21,266 --> 00:02:24,228
కొత్త ఇంట్లో నీ గది చాలా పెద్దగా ఉంటుంది, విలియమ్.

21
00:02:24,770 --> 00:02:27,064
హాలులో కూడా చాలా స్థలం ఉంది,

22
00:02:27,064 --> 00:02:29,066
అక్కడ చాలా పెద్ద క్రిస్మస్ చెట్టు పెట్టుకోవచ్చు.

23
00:02:29,733 --> 00:02:32,653
నీ బొమ్మలన్నీ పెట్టుకోవడానికి ఒక ఆటల గది కూడా ఉంది.

24
00:02:32,653 --> 00:02:34,488
ఇక గార్డెన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు.

25
00:02:34,488 --> 00:02:37,783
దిగువ పక్క మైదానాలు ఉన్నాయి.
ఇంకా పైకి వెళ్తే అడవి కూడా ఉంది.

26
00:02:37,783 --> 00:02:41,411
నీ కొత్త స్కూల్ లో నీ క్లాస్ మేట్స్ ని,
టీచర్లను ఎప్పుడెప్పుడు కలవాలని ఉంది కదా నీకు.

27
00:02:41,411 --> 00:02:43,497
మీ టీచరుది చాలా మంచి గుణం.

28
00:02:43,497 --> 00:02:48,168
నీ క్లాసులో అమ్మాయిలు, అబ్బాయిలందరూ
నిన్ను స్నేహితుడిగా చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు.

29
00:03:01,765 --> 00:03:02,933
సర్.

30
00:03:03,725 --> 00:03:07,062
ఈ సామాను సర్దడంలో మాకు సాయపడతావా, అబ్బాయి?

31
00:03:10,607 --> 00:03:12,276
గుడ్ ఆఫ్టర్ నూన్, విలియమ్.

32
00:03:12,276 --> 00:03:13,735
మోమో!

33
00:03:14,278 --> 00:03:16,530
కాస్త ఆ గడప చూసుకో.

34
00:03:16,530 --> 00:03:17,865
హలో, మేరీ.

35
00:03:17,865 --> 00:03:19,324
అందరికీ గుడ్ ఆఫ్టర్ నూన్.

36
00:03:19,324 --> 00:03:22,286
మీ అమ్మానాన్నలు కుదురుకోవడానికి
కొంత సమయం వాళ్లని వదిలేద్దాం,

37
00:03:22,286 --> 00:03:24,997
ఈలోపు నువ్వు కూడా అంతా తిరిగి చూడవచ్చు.

38
00:03:55,444 --> 00:03:57,154
ఇల్లు చాలా పెద్దగా ఉంది, మోమో.

39
00:03:57,154 --> 00:03:58,363
భలేగా ఉంది కదా?

40
00:03:58,363 --> 00:04:00,240
చాలా గదులు ఉన్నాయి, బోలెడన్ని సాహసాలు చేసుకోవచ్చు.

41
00:04:10,542 --> 00:04:12,544
- నిజానికి మేమిద్దరం వాయిస్తాం.
- నిజంగా?

42
00:04:12,544 --> 00:04:14,671
అంటే, నేను వాయించడానికి ప్రయత్నిస్తా.

43
00:04:14,671 --> 00:04:16,298
ఆమె 18 మందికి వంట చేస్తోంది.

44
00:04:16,298 --> 00:04:18,382
మంచు మనిషి చేద్దాం వస్తావా?

45
00:04:18,382 --> 00:04:20,052
ఇప్పుడు కాదు, బంగారం.

46
00:04:20,052 --> 00:04:22,679
వాటిని పిల్లలే చేశారు. ఏడాదిలోని ఈ సమయమంటే నాకు చాలా ఇష్టం.

47
00:04:22,679 --> 00:04:24,515
- హా. నిజానికి, అంతే.
- కెరోలిన్, ఈ క్రిస్మస్

48
00:04:24,515 --> 00:04:26,391
మీ అమ్మతో గడుపుతాను అన్నావు కదా?

49
00:04:26,391 --> 00:04:27,476
అవును.

50
00:05:22,781 --> 00:05:25,409
నా పేరు విలియమ్. నాతో ఆడుకుంటావా?

51
00:05:28,787 --> 00:05:31,373
నా పేరు విలియమ్. మనిద్దరం ఆడుకుందామా?

52
00:06:24,468 --> 00:06:27,596
"ప్రియమైన విలియమ్, మేము నిన్ను చాలా మిస్ అవుతాం,

53
00:06:27,596 --> 00:06:31,892
కొత్త ఇంట్లో నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం.

54
00:06:31,892 --> 00:06:36,438
కొండంత ప్రేమతో, మేరీ, ఆర్థర్, బోనీ,

55
00:06:36,438 --> 00:06:41,068
పాల్, లిజీ, జేన్, ఆలిస్, జాన్."

56
00:06:47,115 --> 00:06:50,619
ఇక లైట్స్ ఆపేయ్, విలియమ్. రేపు చాలా ముఖ్యమైన రాజు.

57
00:07:43,297 --> 00:07:44,131
సూపర్!

58
00:07:48,677 --> 00:07:50,012
క్రిస్మస్ శుభాకాంక్షలు, బంగారం.

59
00:07:50,012 --> 00:07:53,849
క్రిస్మస్ శుభాకాంక్షలు, మోమో.
నేను ఉదయం ఏడు గంటలకు లేయవచ్చని అన్నావుగా.

60
00:07:53,849 --> 00:07:55,559
ఏడు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ గడిపా.

61
00:07:55,559 --> 00:07:57,186
ఏడు అయింది కదా?

62
00:07:57,186 --> 00:07:58,687
గంట ఆరుసార్లే మోగినట్టుందే.

63
00:07:58,687 --> 00:08:00,981
నాకు ఏడుసార్లు వినిపించింది. నిజంగా చెప్తున్నా.

64
00:08:00,981 --> 00:08:03,734
ఏడు అయితే, క్రిస్మస్ తాత ఏం తెచ్చాడో చూసేయాల్సిందే.

65
00:08:03,734 --> 00:08:04,735
సూపర్!

66
00:08:06,320 --> 00:08:10,032
ఈ కానుక ఎవరికబ్బా!

67
00:08:18,081 --> 00:08:19,750
క్రిస్మస్ శుభాకాంక్షలు, బంగారం.

68
00:08:21,502 --> 00:08:22,836
హలో, కుందేలు బొమ్మా.

69
00:08:32,179 --> 00:08:33,514
కుందేలు బొమ్మా.

70
00:08:45,859 --> 00:08:47,402
వచ్చేశామే, కుందేలు బొమ్మా.

71
00:08:57,120 --> 00:08:58,413
సూపర్.

72
00:08:59,665 --> 00:09:02,251
- క్రిస్మస్ శుభాకాంక్షలు.
- హా. బాగానే ఉన్నావా?

73
00:09:03,418 --> 00:09:05,420
- క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్యూ, ఫాదర్.
- క్రిస్మస్ శుభాకాంక్షలు.

74
00:09:24,773 --> 00:09:25,774
ఏదో నడిచిపోయింది.

75
00:09:28,694 --> 00:09:30,571
నీకు రావడం కష్టమైతే...

76
00:09:31,071 --> 00:09:32,614
పద, బుడ్డోడా.

77
00:09:33,115 --> 00:09:34,533
పడుకుందువు పద.

78
00:09:45,085 --> 00:09:46,086
ఆ...

79
00:09:47,462 --> 00:09:48,463
తప్పకుండా.

80
00:09:49,590 --> 00:09:51,258
క్రిస్మస్ శుభాకాంక్షలు, బంగారం.

81
00:10:49,483 --> 00:10:52,486
గుడ్ ఈవినింగ్, క్రిస్మస్ శుభాకాంక్షలు.

82
00:10:53,028 --> 00:10:55,280
ఆటల గదికి సుస్వాగతం.

83
00:10:55,280 --> 00:10:56,782
నేను తెలివైన గుర్రాన్ని.

84
00:10:56,782 --> 00:10:57,908
మరి నువ్వు ఎవరు?

85
00:10:57,908 --> 00:11:01,411
నేను... నేను కుందేలును అనుకుంటా.

86
00:11:02,412 --> 00:11:04,748
తెలివైన గుర్రమా, ఎవరది?

87
00:11:04,748 --> 00:11:08,252
కొత్త బొమ్మ వచ్చింది. కుందేలు అట.

88
00:11:14,508 --> 00:11:15,342
వస్తున్నాం.

89
00:11:15,342 --> 00:11:17,052
- పద.
- చూస్తా.

90
00:11:17,052 --> 00:11:18,554
అదీ లెక్క.

91
00:11:22,015 --> 00:11:24,101
అంత గొప్పగా ఏం లేదు ఈ బొమ్మ.

92
00:11:24,101 --> 00:11:26,019
ఏమంటావు, కుందేలు?

93
00:11:26,019 --> 00:11:27,855
నువ్వు అసలు నిజమైన బొమ్మవేనా?

94
00:11:28,564 --> 00:11:29,815
అంటే ఏంటో నువ్వే చెప్పాలి.

95
00:11:33,944 --> 00:11:36,947
నిజమైన కారులానే నన్ను కూడా లోహంతోనే చేశారు.

96
00:11:36,947 --> 00:11:40,742
నా నాలుగు పక్కలా, చిన్న చిన్న నల్ల సర్కిల్స్ చూశావా?

97
00:11:40,742 --> 00:11:44,121
- అసలైన కార్లకు కూడా అవి ఉంటాయి.
- అవును.

98
00:11:44,121 --> 00:11:46,874
వాడుక భాషలో టైర్లు అని అంటారు వాటిని.

99
00:11:47,749 --> 00:11:48,834
టైర్లు.

100
00:11:49,585 --> 00:11:51,461
ఇంకో గొప్ప విషయం చెప్పనా...

101
00:11:51,461 --> 00:11:55,090
సింహమా, వచ్చి నాకు కీ ఇవ్వు.

102
00:11:59,386 --> 00:12:02,848
నాకు నిజంగా పని చేసే మోటర్ కూడా ఉంది.

103
00:12:02,848 --> 00:12:07,978
బుడ్డోడు నాకు కీ ఇస్తే చాలు, జుయ్యిమని దూసుకువెళ్లిపోతా.

104
00:12:10,689 --> 00:12:11,690
అంత వేగమా!

105
00:12:12,274 --> 00:12:14,610
- జాగ్రత్త.
- జరుగు.

106
00:12:14,610 --> 00:12:16,028
పక్కకు జరుగు.

107
00:12:18,071 --> 00:12:19,698
ఇంకాస్త ఉంటే గుద్దేసేదాన్ని.

108
00:12:19,698 --> 00:12:22,201
ఇక్కడున్న సింహం కూడా అసలైనదే.

109
00:12:22,201 --> 00:12:24,369
అవును! నా కాళ్లు చూడు.

110
00:12:24,369 --> 00:12:28,582
అసలైన సింహాల లాగానే ఎలా తిరుగుతున్నాయో చూడు,
దీని వల్ల నేను సింహంలా ఎగిరి

111
00:12:28,582 --> 00:12:30,542
ఏ జంతువునైనా మట్టికరిపించేయగలను.

112
00:12:32,377 --> 00:12:34,254
నేను కూడా అసలైన రాజునే.

113
00:12:34,254 --> 00:12:37,966
నా అద్భుతమైన వస్త్రాలు చూడు,
నా అద్భుతమైన కిరీటాన్ని చూడు.

114
00:12:37,966 --> 00:12:41,637
ఇక్కడున్న రాళ్లన్నీ వజ్రాలు, వైడుర్యాలు...

115
00:12:41,637 --> 00:12:43,138
వాటిని చెక్కతో చేశారు.

116
00:12:43,138 --> 00:12:47,434
ఈ ఆటల గదికి రాజుతో మాట్లాడే పద్ధతి ఇదేనా?

117
00:12:47,434 --> 00:12:50,854
వెంటనే మోకాళ్ల మీద కూర్చొని
క్షమాపణ కోరు, ఓ మదమెక్కిన గుర్రమా.

118
00:12:52,856 --> 00:12:54,483
మోకాళ్ల మీద కూర్చోకపోయినా పర్లేదులే.

119
00:12:54,483 --> 00:12:58,862
తెలివైన గుర్రం నా ముందు
శిరస్సు వంచాల్సిన అవసరం లేదని తీర్మానిస్తున్నాను.

120
00:12:58,862 --> 00:13:02,741
క్షమించు, తెలివైన గుర్రమా, అప్పుడప్పుడూ
నాకు పూనకం వస్తుందని నీకు తెలిసిందే కదా.

121
00:13:02,741 --> 00:13:04,368
ఈ వస్త్రాల వల్లే అదంతా.

122
00:13:04,368 --> 00:13:06,745
చాలా అద్భుతంగా ఉన్నాయి కదా, అందుకే.

123
00:13:08,664 --> 00:13:10,624
ఈ కొత్త బొమ్మ ఎలా ఉంది?

124
00:13:10,624 --> 00:13:12,209
నాకు నచ్చలేదు.

125
00:13:12,709 --> 00:13:17,214
ఈ కుందేలు అనబడే బొమ్మని మనం బొమ్మల పెట్టెలో పడుకోనిస్తే,

126
00:13:17,214 --> 00:13:20,717
పక్కలో తోడు కోసం ఈ కుందేలునే తీసుకొనే ప్రమాదం ఉంది.

127
00:13:21,802 --> 00:13:24,012
"పక్కలో తోడు కోసం" అంటే?

128
00:13:25,389 --> 00:13:26,390
రాత్రుళ్లు చాలా వరకు,

129
00:13:26,390 --> 00:13:30,102
బొమ్మల పెట్టె నుండి ఒక బొమ్మని తీసుకొని
బుడ్డోడికి ఇస్తారు అన్నమాట, అతను పడుకొనేటప్పుడు.

130
00:13:30,102 --> 00:13:32,688
బుడ్డోడు ఎక్కడ? మళ్లీ ఇక్కడికి ఎప్పుడు వస్తాడు?

131
00:13:32,688 --> 00:13:34,398
ఇక ప్రశ్నలు అడిగింది చాలు!

132
00:13:34,398 --> 00:13:36,233
మనం ఒక నిర్ణయం తీసుకోవాలి.

133
00:13:36,233 --> 00:13:41,446
దీనికి కదిలే భాగాలు లేవు, కీళ్లు లేవు.

134
00:13:41,947 --> 00:13:44,283
ఈ బొమ్మకి మనం దూరంగా ఉండాలి అని

135
00:13:44,283 --> 00:13:47,744
ఆటల గదిలో మనకి దూరంగా ఆ మూలకి
దీన్ని వెలివేయాలన్నది నా అభిప్రాయం.

136
00:13:47,744 --> 00:13:50,539
- పాపం ఆ బొమ్మని వదిలేయ్!
- కారు చెప్పినదానికే నా ఓటు!

137
00:13:50,539 --> 00:13:51,582
నాది కూడా.

138
00:13:51,582 --> 00:13:52,749
ఇక పద మరి.

139
00:13:53,375 --> 00:13:58,589
దూరంగా ఉన్న ఆ మూలకి వెళ్లిపో,
అక్కడైతే నువ్వు ఎవరికీ కనిపించవు.

140
00:14:01,008 --> 00:14:02,092
ఆగకుండా పద!

141
00:14:04,595 --> 00:14:06,430
బాబోయ్...

142
00:14:07,014 --> 00:14:10,017
నేను కొత్తగా వచ్చినప్పుడు, ఓ పద్ధతి అంటూ ఉండేది.

143
00:14:10,017 --> 00:14:11,935
కొత్త బొమ్మలు, పాత బొమ్మలకి మర్యాదనిచ్చేవి.

144
00:14:11,935 --> 00:14:13,812
బాబోయ్, దారుణం.

145
00:14:14,688 --> 00:14:17,232
- నేను మళ్లీ కిందికి వెళ్లవచ్చా?
- ఇక చాలు.

146
00:14:17,232 --> 00:14:19,985
మంచం ఎక్కి పడుకో. రోజంతా అక్కడే ఆడుకున్నావు.

147
00:14:19,985 --> 00:14:21,904
కానీ నేనేమీ అలిసిపోలేదు.

148
00:14:21,904 --> 00:14:23,780
ఇప్పుడే కదా కుంభకర్ణుడిలా నిద్రపోయావు.

149
00:14:23,780 --> 00:14:25,616
కానీ క్రిస్మస్ ఇంకా అయిపోలేదు కదా.

150
00:14:25,616 --> 00:14:28,994
వీడికి నీళ్లు తీసుకువస్తావా, బంగారం?
వచ్చేటప్పుడు ఒక బొమ్మని కూడా తీసుకురా.

151
00:14:36,376 --> 00:14:39,713
తెలివైన గుర్రమా, "అసలైన" అంటే ఏంటి?

152
00:14:40,214 --> 00:14:42,674
అంటే, కదిలే భాగాలు ఉండటమా లేక...

153
00:14:42,674 --> 00:14:45,135
ఆ బొమ్మలు అన్న మాటలు పట్టించుకోకు, కుందేలు.

154
00:14:45,135 --> 00:14:48,305
'అసలైన' అంటే, మనం ఎలా తయారు అయ్యాం అని కాదు.

155
00:14:48,305 --> 00:14:50,390
అది మనకి ఎదురయ్యే అనుభవం.

156
00:14:51,016 --> 00:14:55,145
ఏ చిన్నారి అయినా మనల్ని చాలా అంటే చాలా కాలం ప్రేమించినప్పుడు,

157
00:14:55,145 --> 00:14:56,688
ఇక్కడ ప్రేమ అంటే ఆడుకోవడం కాదు,

158
00:14:56,688 --> 00:15:01,944
మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నప్పుడు,
మనం అసలైన వాళ్ళం అయిపోతాం.

159
00:15:02,611 --> 00:15:04,863
అది ఊహాలోకం యొక్క అద్భుతమైన మాయ.

160
00:15:06,031 --> 00:15:07,366
అది బాధని కలిగిస్తుందా?

161
00:15:08,700 --> 00:15:11,954
కాస్త బాధగానే అనిపిస్తుంది అనుకుంటా,
ఎందుకంటే ప్రేమని అందుకున్న బొమ్మలు

162
00:15:11,954 --> 00:15:15,082
ఎన్నెన్నో సాహసాలు చేసి అలసిపోతాయి.

163
00:15:15,999 --> 00:15:19,503
కానీ చెప్తున్నా కదా, అది తప్పక అనుభవించాల్సిన విషయం.

164
00:15:20,128 --> 00:15:24,883
పిల్లలు మనల్ని మనస్పూర్తిగా ప్రేమిస్తారు.

165
00:15:26,635 --> 00:15:30,597
అంత కన్నా అద్భుతమైన ఫీలింగ్ నాకెన్నడూ కలగలేదు.

166
00:15:33,475 --> 00:15:36,979
నేను కూడా ఏదోకరోజు అసలైన బొమ్మలా మారాలనుకుంటున్నా.

167
00:15:36,979 --> 00:15:40,774
బుడ్డోడు నిన్ను ప్రేమిస్తే, తప్పక అవుతావు.

168
00:15:43,068 --> 00:15:43,902
ఎవరో వస్తున్నారు.

169
00:15:43,902 --> 00:15:45,696
- జాగ్రత్త!
- జాగ్రత్త!

170
00:15:45,696 --> 00:15:46,989
ఆ సమయం అయింది!

171
00:15:48,156 --> 00:15:49,324
ఏమైనా జరగవచ్చు.

172
00:15:49,324 --> 00:15:52,077
- జరుగు. జరుగు.
- తను నన్ను నెడుతోంది.

173
00:15:52,077 --> 00:15:53,579
నాకు కాస్త స్థలం ఇవ్వు.

174
00:15:54,872 --> 00:15:55,914
ఏ బొమ్మ కావాలి?

175
00:15:55,914 --> 00:15:57,291
నా కుందేలు బొమ్మ!

176
00:15:59,168 --> 00:16:00,335
హా. ఇక్కడే ఉంది.

177
00:16:08,093 --> 00:16:09,344
కంటి నిండా నిద్రపో.

178
00:16:10,387 --> 00:16:11,388
గుడ్ నైట్.

179
00:16:21,565 --> 00:16:22,983
హలో, కుందేలు.

180
00:16:22,983 --> 00:16:24,902
నాతో అడుకుంటావా?

181
00:16:27,070 --> 00:16:29,907
సూపర్. గుంతలను బాగా తవ్వేవాళ్లు నాకు కావాలి.

182
00:16:29,907 --> 00:16:34,369
నువ్వు కుందేలువి కాబట్టి,
ఆ పని నువ్వైతే చక్కగా చేయగలవని అనుకున్నా.

183
00:16:35,579 --> 00:16:37,456
ఇక పని మొదలుపెడదామా?

184
00:16:45,714 --> 00:16:46,715
వావ్.

185
00:16:47,216 --> 00:16:50,427
నీ అంత అద్భుతంగా తవ్వేవాళ్లని
నేనెప్పుడూ చూడనేలేదు, కుందేలు.

186
00:16:50,427 --> 00:16:53,722
ఇప్పటికే మనం ఎన్నో లక్షల కిలోమీటర్లు
భూగర్భంలోకి వచ్చేసి ఉంటాం.

187
00:16:53,722 --> 00:16:55,599
మనం జాగ్రత్తగా ఉండాలి.

188
00:16:55,599 --> 00:16:59,019
నేల అంతా పొడిగా ఉంది,
ఈ సొరంగం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు.

189
00:16:59,520 --> 00:17:01,939
మా కుందేళ్లకి అలాంటివి ఇట్టే తెలిసిపోతాయి.

190
00:17:03,815 --> 00:17:08,194
కానీ నా లెక్కల ప్రకారం, మనం సగం దూరం వచ్చేశాం.

191
00:17:09,363 --> 00:17:10,489
ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం?

192
00:17:10,489 --> 00:17:12,115
చిసప్ కి వెళ్తున్నాం.

193
00:17:12,115 --> 00:17:14,034
నేను అక్కడే ఉండేవాడిని.

194
00:17:14,034 --> 00:17:15,618
నా స్నేహితులందరూ కూడా అక్కడే ఉన్నారు.

195
00:17:17,954 --> 00:17:19,957
ఇక్కడ నాకు స్నేహితులెవరూ లేరు.

196
00:17:22,291 --> 00:17:23,417
నేనున్నా కదా.

197
00:17:25,170 --> 00:17:26,380
నిజమే.

198
00:17:26,380 --> 00:17:30,467
నువ్వు నా కొత్త నేస్తానివి,
అంటే నువ్వు నాకు ప్రాణ నేస్తానివి కూడా.

199
00:17:32,219 --> 00:17:36,306
దేవుడా, నన్ను ప్రాణ నేస్తం అన్న తొలి వ్యక్తివి నువ్వే.

200
00:17:41,979 --> 00:17:45,816
ఎంత వేగంగా తవ్వేస్తున్నామో చూడు. ఇంకాసేపట్లో వెళ్లిపోతాం.

201
00:17:48,443 --> 00:17:49,528
చేతికి ఏదో తగిలింది.

202
00:17:58,370 --> 00:18:01,123
ఏదో నిధికి మ్యాప్!

203
00:18:02,416 --> 00:18:03,417
వావ్.

204
00:18:04,793 --> 00:18:05,794
ఏంటా శబ్దం?

205
00:18:06,545 --> 00:18:07,921
సొరంగం!

206
00:18:07,921 --> 00:18:09,006
కూలిపోతోంది.

207
00:18:09,798 --> 00:18:12,384
కుందేలూ, త్వరగా పదా, మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి.

208
00:18:12,384 --> 00:18:13,760
నన్ను గట్టిగా పట్టుకో.

209
00:18:16,847 --> 00:18:20,309
- మనం చేరుకోలేము!
- లేదు వెళ్ళిపోతాం. ఇంకెంతో దూరం లేదు.

210
00:18:22,102 --> 00:18:23,270
వచ్చేశాం, కుందేలు.

211
00:18:24,104 --> 00:18:25,189
క్షేమంగా బయటపడ్డాం.

212
00:18:29,193 --> 00:18:30,861
మనం ఇప్పుడు ప్రాణ స్నేహితులం అయిపోయాం కాబట్టి,

213
00:18:30,861 --> 00:18:35,699
ఆ నిధి కోసం కలిసి గాలిద్దాం.

214
00:18:52,508 --> 00:18:55,886
పిల్లలూ, మీ అందరికీ ఒకరిని పరిచయం చేస్తున్నాను.

215
00:18:58,013 --> 00:19:01,975
విలియమ్, ఇక్కడికి రాగలవా?

216
00:19:03,477 --> 00:19:04,478
రా.

217
00:19:16,823 --> 00:19:19,117
పిల్లలూ, విలియమ్ ని పలకరించండి.

218
00:19:19,117 --> 00:19:21,411
హలో, విలియమ్.

219
00:19:22,079 --> 00:19:26,291
విలియమ్, నీ గురించి పిల్లలకు ఏమైనా చెప్తావా?

220
00:19:36,593 --> 00:19:39,096
మరేం పర్వాలేదు, విలియమ్. ఇక కూర్చోలే.

221
00:19:41,598 --> 00:19:44,685
పోయిన వారం, మనం ఆకురాలు కాలం గురించి మాట్లాడుకున్నాం.

222
00:19:44,685 --> 00:19:47,563
ఆకురాలు కాలంలో ఏం జరుగుతుందో, ఎవరికైనా గుర్తుందా?

223
00:19:52,234 --> 00:19:53,527
హలో.

224
00:19:53,527 --> 00:19:55,654
నువ్వు పక్కింట్లో ఉండే అబ్బాయివి కదా?

225
00:19:56,989 --> 00:19:58,657
మాతో ఆడుకుంటావా?

226
00:20:01,493 --> 00:20:03,328
అతడిని వదిలేయ్, లూసీ. ఆడుకుందాం పద.

227
00:20:11,879 --> 00:20:14,923
త్వరగా వెళ్దాం! వంతెన తెరిచి ఉన్నప్పుడే
కోటపై దండయాత్ర చేద్దాం.

228
00:20:14,923 --> 00:20:16,925
నిధి సింహాసనం ఉండే గదిలోనే ఉందనుకుంటా.

229
00:20:16,925 --> 00:20:19,219
విలియమ్, భోజనం సిద్ధంగా ఉంది.

230
00:20:24,099 --> 00:20:25,392
ఇంకాస్త క్యాబేజీ కావాలా?

231
00:20:25,392 --> 00:20:26,810
నాకు కూడా కడుపు నిండిపోయింది.

232
00:20:26,810 --> 00:20:33,609
కానీ నేనెంత తిన్నా కానీ, మోమో ఇంకా తినమని
బలవంత పెట్టి, రెండు ముద్దలు తినిపిస్తుంది.

233
00:20:33,609 --> 00:20:37,362
చూడు, నిధి ఆచూకీని కనిపెట్టడానికి నేనొక ప్లాన్ వేశాను.

234
00:20:38,238 --> 00:20:39,615
మనకి మ్యాజిక్ అవసరం అవుతుంది.

235
00:20:40,115 --> 00:20:42,492
బయట ఫెయిరీలు జీవిస్తూ ఉంటాయని జార్జ్ అన్నాడు.

236
00:20:42,492 --> 00:20:46,121
వాటిని కలవాలంటే, వాటి కోసం ఒక చిన్న ఇల్లు కట్టివ్వాలట.

237
00:20:47,247 --> 00:20:48,248
మోమో.

238
00:20:48,749 --> 00:20:51,210
నేను, కుందేలు తినేశాము. మేము వెళ్లి మళ్లీ ఆడుకోవచ్చా?

239
00:20:51,210 --> 00:20:52,920
ఇంకో రెండు ముద్దలు తిను.

240
00:20:56,632 --> 00:20:57,883
సరిగ్గా తినాలి.

241
00:21:12,272 --> 00:21:15,359
ఇది అధికారిక ఫెయిరీ నివాసం అన్నమాట.

242
00:21:15,359 --> 00:21:18,570
ఇప్పుడు మనం ఫెయిరీల మంత్రం చెప్తే సరిపోతుంది.

243
00:21:21,406 --> 00:21:24,660
ఫెయిరీలు రెక్కలను రెపరెపలాడించుకుంటూ ఎగురుతాయి.

244
00:21:25,577 --> 00:21:29,164
ఈ తోటకి రండి, పైన ఆకాశం ఉంది.

245
00:21:29,164 --> 00:21:34,253
బెదురే లేని విలియమ్, కుందేలు కలిసి
"అక్కుం బక్కుం. టిక్కుం ట్రియ్యుం!

246
00:21:34,253 --> 00:21:37,548
మాకు మీ మ్యాజిక్ తో పనుంది, కాబట్టి ఇక్కడికి తప్పక రండి!"

247
00:21:39,091 --> 00:21:41,468
ఇక మనం అస్సలు అనుకోనప్పుడు

248
00:21:41,468 --> 00:21:45,097
ఒక మ్యాజిక్ ఫెయిరీ ప్రత్యక్షమయి,
నిధిని కనుగొనడంలో మనకి సాయపడుతుంది.

249
00:21:51,186 --> 00:21:52,354
గుడ్ నైట్, మోమో.

250
00:21:53,897 --> 00:21:57,401
బాబోయ్, ఆ కుందేలు బొమ్మ ఎలా ఉందో చూడు.
దాన్ని తీసుకెళ్లి, బాగా కుట్టి తీసుకువస్తా.

251
00:21:57,401 --> 00:21:59,736
వద్దు! తీసుకెళ్లకు, మోమో.

252
00:21:59,736 --> 00:22:01,071
కుందేలు బొమ్మని తీసుకెళ్లకు.

253
00:22:01,071 --> 00:22:02,447
సరే, సరే.

254
00:22:02,447 --> 00:22:03,949
అయ్య బాబోయ్.

255
00:22:03,949 --> 00:22:06,201
కాస్త కుట్టుతాను అంటున్నా, అంతే కదా.

256
00:22:06,201 --> 00:22:07,828
ఒక బొమ్మ కోసం ఇంత బిల్డప్ ఇస్తున్నావే.

257
00:22:07,828 --> 00:22:10,372
ఇదేమీ బొమ్మ కాదు, మోమో. ఇది అసలైన కుందేలే.

258
00:22:10,372 --> 00:22:13,000
సరే, నువ్వేదంటే అది.

259
00:22:14,418 --> 00:22:15,502
గుడ్ నైట్.

260
00:22:30,809 --> 00:22:32,186
బుడ్డోడా?

261
00:22:32,186 --> 00:22:33,437
అవును.

262
00:22:33,437 --> 00:22:35,814
నువ్వు అసలైన దానివే అన్నాడా?

263
00:22:36,440 --> 00:22:37,774
అవును.

264
00:22:37,774 --> 00:22:39,985
- నిన్నా?
- అవును.

265
00:22:39,985 --> 00:22:42,571
మరి నీకు కొత్తగా ఏమైనా అనిపించిందా?

266
00:22:42,571 --> 00:22:44,239
ఏమో మరి.

267
00:22:44,239 --> 00:22:46,074
కొత్తగా నాకేమీ అనిపించలేదు.

268
00:22:46,074 --> 00:22:50,162
ఇంతకు ముందు ఎలా ఉన్నావో, ఇప్పుడూ
అలానే ఉన్నావు. బొమ్మలానే ఉన్నావు.

269
00:22:50,162 --> 00:22:53,790
కానీ మీరందరూ కూడా బొమ్మలే అయినా,
అసలైన వాళ్లమే అని చెప్పారు కదా.

270
00:22:53,790 --> 00:22:56,043
అవును, కానీ అలా మేము ఊరికే అన్నాం అంతే.

271
00:22:56,043 --> 00:22:58,212
అసలైన వాళ్లమని నటిస్తున్నామంతే.

272
00:22:58,212 --> 00:23:03,800
కానీ మాకు, మేము ప్రాతినిధ్యం
వహించే వాటికి చాలా పోలికలు ఉన్నాయి.

273
00:23:04,301 --> 00:23:05,928
సింహానికి జూలు ఉంది.

274
00:23:05,928 --> 00:23:08,138
- రాజుకు కిరీటం ఉంది.
- అవును మరి.

275
00:23:08,138 --> 00:23:09,348
మరి నీ సంగతి చూడు.

276
00:23:09,348 --> 00:23:11,475
నువ్వు బాగా మురికిగా ఉన్నావు.

277
00:23:12,142 --> 00:23:14,311
- నువ్వు చిరిగిపోయి ఉన్నావు.
- అవును. అవునవును.

278
00:23:14,311 --> 00:23:19,525
ఇంకో విషయం చెప్తే బాధపడతావు,
నీ లోపల ఉండే దూది కూడా నాకు కనిపిస్తోంది.

279
00:23:19,525 --> 00:23:23,779
ఈ బొమ్మ లోపల... అయ్య బాబోయ్! నీ లోపల ఏదేదో ఉందేంటి?

280
00:23:24,988 --> 00:23:30,202
నా ఇన్నేళ్ల అనుభవంలో జాయింట్లు,
యంత్రాలు లేని బొమ్మని చూడటం ఇదే మొదటిసారి!

281
00:23:30,202 --> 00:23:35,040
నీలో ఏ ఒక్కటీ సరిగ్గా లేనప్పుడు,
నువ్వు అసలైన కుందేలువి ఎలా అవుతావు?

282
00:23:35,040 --> 00:23:36,291
ఇక చాలు.

283
00:23:36,291 --> 00:23:39,628
మీలో ఏ ఒక్కరికీ బొమ్మ కాకుండా
నిజంగా ఉంటే ఎలా ఉంటుందో తెలీదు.

284
00:23:39,628 --> 00:23:41,547
బుడ్డోడికి అన్నీ బాగా తెలుసు,

285
00:23:41,547 --> 00:23:46,051
కుందేలు అసలైనదే అని అతను అన్నాడంటే, అది అసలైనదే.

286
00:23:46,969 --> 00:23:48,136
ఎవరో వస్తున్నారు.

287
00:23:49,930 --> 00:23:52,850
కుందేలు, ఫెయిరీ మంత్రం పని చేయలేదని నాకు తెలుసు,

288
00:23:52,850 --> 00:23:55,060
కానీ మనం ఎక్కువ సేపు వేచి ఉండకూడదు.

289
00:23:55,936 --> 00:23:58,939
నిధి ఆచూకీని ఇతరులు కనిపెట్టక ముందే మనం కనిపెట్టాలి.

290
00:24:00,482 --> 00:24:03,110
అది మాయా అడవిలో ఉందనుకుంటా.

291
00:24:37,895 --> 00:24:39,605
అక్కడ ఏదో కదిలినట్టు నాకు కనిపించింది, కుందేలు.

292
00:24:39,605 --> 00:24:41,899
నిజంగానే చెప్తున్నా, నాకేదో కనిపించింది.

293
00:24:52,659 --> 00:24:53,660
లేదు!

294
00:24:54,161 --> 00:24:56,496
అదేమంత పెద్ద సమస్య కాదు.

295
00:24:56,496 --> 00:24:58,290
కుందేలు, ఏంటది?

296
00:24:58,290 --> 00:25:00,459
వాడెప్పుడూ ఒంటరిగానే గడుపుతున్నాడు.

297
00:25:01,251 --> 00:25:03,086
అది వాడికి మంచిది కాదు.

298
00:25:03,086 --> 00:25:04,588
అది గమనించింది నేనొక్క దాన్నే కాదు.

299
00:25:04,588 --> 00:25:06,632
టీచర్లు కూడా గమనించారు.

300
00:25:07,216 --> 00:25:09,259
స్నేహితులను చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది.

301
00:25:09,259 --> 00:25:10,761
ఇప్పటికే చాలా నెలలయింది.

302
00:25:10,761 --> 00:25:12,846
ఇంకా ఎన్నాళ్లని మనం వదిలేయాలి?

303
00:25:13,722 --> 00:25:15,891
వాడి కుందేలు బొమ్మతో బాగానే ఆడుకుంటున్నట్టున్నాడుగా.

304
00:25:15,891 --> 00:25:18,477
కానీ వాడికి నిజమైన మిత్రులెవరూ లేరు.

305
00:25:35,160 --> 00:25:38,121
మనం ఎలాంటి నిధిని వెతుకుతున్నాం?

306
00:25:38,121 --> 00:25:39,456
బంగారమా?

307
00:25:39,456 --> 00:25:40,749
నగలా?

308
00:25:41,291 --> 00:25:42,835
లేదా చాక్లెట్లా?

309
00:25:43,627 --> 00:25:46,630
అవేవీ కాదనుకుంటా.

310
00:25:47,214 --> 00:25:50,926
అదేంటో నాకు కూడా ఖచ్చితంగా తెలీదు,
కానీ చూడగానే దాన్ని మనం కనిపెట్టేస్తామనిపిస్తోంది.

311
00:25:53,262 --> 00:25:54,680
మనం శబ్దం చేయకూడదు.

312
00:25:54,680 --> 00:25:58,141
ఈ అడవిలో క్రూర మృగాలు చాలా ఉన్నాయి.

313
00:25:58,684 --> 00:26:01,645
కుందేళ్లమైన మేము, మాట్లాడకుండానే సంభాషించుకుంటాం.

314
00:26:01,645 --> 00:26:06,900
ఉదాహరణకు, మాకు ప్రమాదం
అనిపించినప్పుడు, మేము కాళ్లని ఇలా తడతాం.

315
00:26:13,031 --> 00:26:14,199
మేము ఇలా కూడా చేస్తాం.

316
00:26:16,535 --> 00:26:17,953
దానర్థం ఏంటి?

317
00:26:17,953 --> 00:26:22,457
దాని అర్థం హలో అని. బై చెప్పేటప్పుడు కూడా అలా అంటాం.

318
00:26:23,333 --> 00:26:25,252
హలో, బై, రెండూ ఒకటేనా?

319
00:26:25,252 --> 00:26:30,090
అవును, ఎందుకంటే ఒకరికి బై చెప్పేటప్పుడు,
ఇంకొకరికి హలో చెప్తాం కదా.

320
00:26:30,757 --> 00:26:33,969
ప్రతీ ముగింపు కూడా ఇంకేదో వేరే దానికి ప్రారంభమే.

321
00:26:38,182 --> 00:26:41,935
నువ్వు ఇంతకు ముందే అలా అన్నావు. అంటే ఏదో ప్రమాదం...

322
00:26:42,436 --> 00:26:43,562
పరుగెత్తు!

323
00:26:50,444 --> 00:26:53,155
నన్ను వదిలేయ్. నీ ప్రాణాలు కాపాడుకో.

324
00:26:53,155 --> 00:26:54,239
అలా ఎప్పటికీ చేయను!

325
00:27:00,204 --> 00:27:02,247
అయ్యో. మనం ఇరుక్కుపోయాం.

326
00:27:06,919 --> 00:27:07,836
గట్టిగా పట్టుకో.

327
00:27:14,259 --> 00:27:16,261
అదరగొట్టేశావు.

328
00:27:16,261 --> 00:27:18,514
నువ్వు ఇలా తప్పించావంటే, నమ్మలేకపోతున్నా.

329
00:27:18,514 --> 00:27:21,517
- అవును! మనం సాధించాం, కుందేలు.
- యాహూ! నువ్వు సాధించావు.

330
00:27:24,520 --> 00:27:25,729
నువ్వు బాగానే ఉన్నావా?

331
00:27:25,729 --> 00:27:26,813
బాగానే ఉన్నా.

332
00:27:37,115 --> 00:27:38,367
విలియమ్!

333
00:27:40,702 --> 00:27:42,079
నువ్వు బాగానే ఉన్నావా?

334
00:27:52,923 --> 00:27:54,091
వచ్చి చూడు.

335
00:27:56,134 --> 00:27:59,596
- ఎవరు నువ్వు?
- ఎవరు నువ్వు అసలు?

336
00:27:59,596 --> 00:28:01,723
మీలానే నేను కూడా కుందేలునే.

337
00:28:02,933 --> 00:28:06,395
కానీ నువ్వు కుందేలులా కనిపించట్లేదు. బొమ్మలా ఉన్నావు.

338
00:28:07,729 --> 00:28:11,316
ఒకప్పుడు బొమ్మ కుందేలునే,
కానీ ఇప్పుడు నిజమైన కుందేలుని.

339
00:28:12,776 --> 00:28:15,279
ఒక చిన్నారి మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే,
మనం నిజం అయిపోతాం.

340
00:28:15,988 --> 00:28:18,824
ఊహాలోకపు మాయ పనితనం ఇది.

341
00:28:20,784 --> 00:28:22,578
నువ్వు అటూ ఇటూ కదలగలవా?

342
00:28:22,578 --> 00:28:25,539
కదలలేను.

343
00:28:26,623 --> 00:28:27,791
గెంతగలవా?

344
00:28:29,459 --> 00:28:32,045
దీనికి కాళ్లు సరిగ్గా లేవు,

345
00:28:32,754 --> 00:28:36,091
గెంతకుండా అసలైన కుందేలువి ఎలా కాగలవు నువ్వు?

346
00:28:37,509 --> 00:28:38,927
నాకు తెలీదు.

347
00:28:39,428 --> 00:28:42,890
ఎవరైనా చిన్నారి ప్రేమిస్తే, నిజం అయిపోతాం అన్నావు కదా.

348
00:28:42,890 --> 00:28:47,102
అసలు ఈ చిన్నారి నిన్ను మనస్ఫూర్తిగా
ప్రేమిస్తున్నాడని నీకు ఖచ్చితంగా తెలుసా?

349
00:28:48,228 --> 00:28:49,563
నిన్ను ప్రేమిస్తున్నానని అతను అన్నాడా?

350
00:28:50,606 --> 00:28:52,691
లేదు, నేను నిజమైన దాన్ని అన్నాడు.

351
00:28:54,318 --> 00:28:55,319
కానీ నాకు అనిపించింది ఏంటంటే...

352
00:28:55,319 --> 00:28:59,072
అతనికి నీపై ప్రేమ ఉంటే,
ఎందుకు నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్లిపోయాడు?

353
00:28:59,072 --> 00:29:00,699
అది కూడా చలిలో.

354
00:29:03,076 --> 00:29:04,077
వెళ్దాం పద.

355
00:29:04,077 --> 00:29:05,495
చీకటి పడేలా ఉంది.

356
00:29:06,038 --> 00:29:09,082
- మనం మన బోనులోకి వెళ్దాం పద.
- గుడ్ లక్.

357
00:29:09,082 --> 00:29:10,918
గుడ్ లక్, కుందేలు బొమ్మా.

358
00:29:11,418 --> 00:29:12,794
పాపం.

359
00:29:35,442 --> 00:29:37,152
ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు?

360
00:29:38,612 --> 00:29:41,156
రా. నిన్ను ఉండాల్సిన చోటుకు చేర్చుతాను.

361
00:29:48,497 --> 00:29:50,207
ఏమైపోయావు, కుందేలు?

362
00:29:52,000 --> 00:29:53,669
బుడ్డోడు నన్ను బయటే వదిలేశాడు.

363
00:29:54,795 --> 00:29:59,424
నిజమైన కుందేళ్లు వచ్చి,
నేను ఇంకా ఒక బొమ్మ కుందేలునే అని చెప్పాయి.

364
00:30:00,884 --> 00:30:02,386
వాళ్లు చెప్పింది నిజమేనేమో అనిపిస్తోంది.

365
00:30:03,762 --> 00:30:10,185
బహుశా బుడ్డోడికి నాపై ప్రేమ లేదేమో,
అందుకే ఇంకా బొమ్మలానే ఉన్నానేమో.

366
00:30:11,645 --> 00:30:14,523
బుడ్డోడికి ఆరోగ్యం బాగాలేదు, కుందేలు.

367
00:30:14,523 --> 00:30:17,150
ఏంటి? బాగాలేదు అంటే?

368
00:30:17,150 --> 00:30:19,862
బాగా జ్వరం చేసింది, బెడ్ మీద విశ్రాంతి తీసుకుంటున్నాడు.

369
00:30:20,362 --> 00:30:23,866
నిన్న రాత్రి బుడ్డోడి అమ్మతో
డాక్టర్ మాట్లాడుతుంటే మేము విన్నాం.

370
00:30:23,866 --> 00:30:26,660
కానీ బుడ్డోడికి ఏమీ కాదు కదా?

371
00:30:26,660 --> 00:30:28,203
అతనికి ఏమీ కాదు.

372
00:30:28,203 --> 00:30:32,249
చాలా ఏళ్ల క్రితం, అతని అంకుల్ కి
కూడా ఇలాగే జ్వరం వచ్చింది.

373
00:30:32,249 --> 00:30:34,293
కానీ ఆయన ప్రాణాలు నిలుపుకోలేకపోయాడు.

374
00:30:35,210 --> 00:30:36,503
చాలా మంది పరిస్థితి అదే.

375
00:30:37,963 --> 00:30:39,840
ఇంకో విషయం, కుందేలు.

376
00:30:41,008 --> 00:30:42,759
అతని అంకుల్ ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడు,

377
00:30:42,759 --> 00:30:47,264
ఆ సమయంలో అతను తాకిన వాటన్నింటినీ తగలబెట్టేశారు.

378
00:30:47,264 --> 00:30:49,224
అలా చేయమని డాక్టర్ చెప్పారు.

379
00:30:49,224 --> 00:30:52,227
ఆ రోగం వ్యాపించకుండా అలా చేస్తారు.

380
00:30:52,728 --> 00:30:57,024
కాబట్టి, ఈరాత్రి బొమ్మ కోసం
వాళ్లు వచ్చినప్పుడు, నువ్వు దాక్కోవాలి.

381
00:30:57,024 --> 00:31:01,528
దాక్కోకపోతే, నిన్ను తీసుకెళ్తారు, ఇక నీ పని అంతే.

382
00:31:02,154 --> 00:31:03,572
అర్థమైందా?

383
00:31:07,659 --> 00:31:09,661
చూడండి. అడుగో డాక్టర్.

384
00:31:11,288 --> 00:31:12,956
- వచ్చినందుకు థ్యాంక్స్.
- దానిదేముందిలే.

385
00:31:26,845 --> 00:31:29,056
మీకు నిజం చెప్పేస్తున్నాను. అతనికి...

386
00:31:31,016 --> 00:31:32,184
అతనికి చాలా అనారోగ్యంగా ఉంది.

387
00:31:33,644 --> 00:31:35,145
బాగా అయిపోతుందా?

388
00:31:36,813 --> 00:31:39,441
మన్నించాలి. ఏమీ చెప్పలేని పరిస్థితి.

389
00:31:40,442 --> 00:31:42,528
ఈ రాత్రి చాలా కష్టంగా గడుస్తుంది.

390
00:31:42,528 --> 00:31:44,446
మీరు అతని కోసం మీ గుండె ధైర్యం చేసుకోవాలి.

391
00:31:46,907 --> 00:31:47,908
నేను...

392
00:31:50,827 --> 00:31:53,038
నేను వెళ్లి బొమ్మ తెచ్చి అతని పక్కన పెడతాను.

393
00:32:08,262 --> 00:32:10,055
తను వస్తోంది. పదండి దాక్కుందాం.

394
00:32:10,055 --> 00:32:11,306
వెళ్లిపోదాం మనం.

395
00:32:11,306 --> 00:32:12,599
తను వచ్చేస్తోంది.

396
00:32:13,475 --> 00:32:16,186
కుందేలు, నువ్వు కూడా దాక్కోవాలి.

397
00:32:16,186 --> 00:32:20,315
ఆ గదిలోకి తను నిన్ను తీసుకెళ్తే,
నువ్వు కూడా అగ్నికి ఆహుతి అయిపోతావు.

398
00:32:20,315 --> 00:32:25,362
మేమిద్దరం కలిసి చాలా సాహసాలు చేశాం,
ఒక్కదానిలో కూడా అతను నన్ను వదిలేసి వెళ్లిపోలేదు.

399
00:32:26,572 --> 00:32:28,907
కాబట్టి, ఇప్పుడు నేను కూడా అతడిని వదిలేసి వెళ్లను.

400
00:32:28,907 --> 00:32:32,619
కుందేలు, దయచేసి తెలివిగా ఆలోచించు.

401
00:32:32,619 --> 00:32:34,621
ఇలా చేస్తే, నీ అంతం తప్పదు.

402
00:32:35,372 --> 00:32:38,667
నువ్వే అన్నావు కదా, బుడ్డోడు నిన్ను బయట వదిలేశాడని.

403
00:32:39,501 --> 00:32:42,045
బహూశా నీపై అతనికి ప్రేమ లేదేమో.

404
00:32:44,673 --> 00:32:49,928
అది నిజం కావచ్చు, కానీ అతనిపై నాకు చాలా ప్రేమ ఉంది.

405
00:33:16,121 --> 00:33:17,915
ఇదిగో నీకు ఇష్టమైన బొమ్మ, బంగారం.

406
00:33:32,471 --> 00:33:34,306
నువ్వేనా, కుందేలు?

407
00:33:35,766 --> 00:33:36,975
నేనే.

408
00:33:41,939 --> 00:33:43,148
నాకు భయంగా ఉంది.

409
00:33:44,107 --> 00:33:45,317
నాకు తెలుసు.

410
00:33:45,943 --> 00:33:47,152
నాకు కూడా భయంగానే ఉంది.

411
00:33:48,403 --> 00:33:50,322
నేను ఇంకా ధైర్యంగా ఉండుంటే బాగుండేది.

412
00:33:50,322 --> 00:33:52,491
ఎప్పుడూ అలాగే అనుకొనేవాడిని.

413
00:33:52,491 --> 00:33:54,576
నీకు ధైర్యం బాగానే ఉంది కదా?

414
00:33:54,576 --> 00:33:59,581
మనం కలిసి చేసిన సాహసాలన్నింటిలో,
మనల్ని ప్రతీసారి కాపాడింది నువ్వే కదా.

415
00:33:59,581 --> 00:34:01,375
నన్నెప్పుడూ నువ్వు వదిలేసి వెళ్లిపోలేదు.

416
00:34:02,334 --> 00:34:04,670
ఇది చాలు, వేరేగా ఉండుంటే
బాగుంటుందని అనుకోవాల్సిన పని లేదు.

417
00:34:04,670 --> 00:34:07,172
నీలో ఏ లోపాలూ లేవు.

418
00:34:08,130 --> 00:34:10,384
నేను ధైర్యవంతుడినని నిజంగానే అనుకుంటున్నావా?

419
00:34:11,009 --> 00:34:13,136
నీ అంత ధైర్యవంతుడు మరొకరు లేరు.

420
00:34:18,225 --> 00:34:22,603
నేను కోలుకున్నప్పుడు,
బీచ్ కి వెళ్దామని అమ్మానాన్నలు అన్నారు.

421
00:34:22,603 --> 00:34:24,731
అది చాలా బాగుంటుంది కదా?

422
00:34:24,731 --> 00:34:27,025
మన నిధి అక్కడ ఉంటుందేమో.

423
00:34:28,025 --> 00:34:30,279
బహూశా దాన్ని అక్కడి ఇసుకలో దాచారేమో.

424
00:34:31,071 --> 00:34:32,989
మనం నిధిని కనుగొనాల్సిన పని లేదు.

425
00:34:33,782 --> 00:34:35,701
నేను ఎప్పుడో నిధిని కనిపెట్టేశాను.

426
00:34:36,994 --> 00:34:38,661
నువ్వంటే నాకు ప్రాణం, కుందేలు.

427
00:34:40,038 --> 00:34:41,456
నాకు కూడా.

428
00:34:59,391 --> 00:35:02,895
ఇంట్లోని కిటికీలన్నింటినీ తెరవండి.
ఇంట్లోకి తాజా గాలి వచ్చేలా చేయండి.

429
00:35:02,895 --> 00:35:05,564
భోజనానికి పిల్లాడికి సూప్ చేద్దామనుకుంటున్నా, డాక్టర్.

430
00:35:05,564 --> 00:35:07,733
- పర్వాలేదు కదా?
- మరేం పర్వాలేదు.

431
00:35:09,776 --> 00:35:13,447
అంటురోగం ఉన్నప్పుడు, విలియమ్ కి
దగ్గరగా ఉన్నవాటన్నింటినీ తగలబెట్టేయండి.

432
00:35:13,447 --> 00:35:15,157
ఈ రోగం ఇతరులకు అంటుకోకుండా చూసుకోవాలి కదా.

433
00:35:15,157 --> 00:35:18,410
కాబట్టి, దుప్పట్లను, నైట్ డ్రెస్ లను,
బొమ్మలని, అన్నింటినీ తగలబెట్టేయండి.

434
00:35:24,917 --> 00:35:26,752
నువ్వు ఇక్కడ ఉండి మంచిదైంది, జార్జ్.

435
00:35:26,752 --> 00:35:28,587
ఇవి తగలబెట్టేస్తే చాలు.

436
00:35:30,255 --> 00:35:31,298
ఆ పని ఇప్పుడే చేసేస్తాను.

437
00:35:32,257 --> 00:35:33,467
వెళ్లి అగ్గిపెట్టె తీసుకొస్తా.

438
00:35:34,176 --> 00:35:36,303
విలియమ్ కోలుకుంటున్నందుకు ఆనందంగా ఉంది.

439
00:35:37,137 --> 00:35:39,306
ఇంకో గంటలో మళ్లీ అల్లరి చేయడం మొదలుపెడతాడు.

440
00:35:39,806 --> 00:35:41,433
అలాగే ఉండాలి కదా.

441
00:35:41,433 --> 00:35:44,645
- ఇక నేను మంట వేస్తాను.
- థ్యాంక్స్, జార్జ్.

442
00:35:44,645 --> 00:35:46,230
వాతావరణం చలిగా అయిపోయింది కదా?

443
00:35:55,155 --> 00:35:57,282
లేదు! లేదు!

444
00:35:57,282 --> 00:35:59,243
దయచేసి కోపం తెచ్చుకోకు, బంగారం.

445
00:35:59,243 --> 00:36:00,661
నేనేమీ కోపం తెచ్చుకోవట్లేదు!

446
00:36:00,661 --> 00:36:01,954
అది ఏది?

447
00:36:02,829 --> 00:36:04,039
కుందేలు గురించి అడుగుతున్నాడు.

448
00:36:04,039 --> 00:36:05,791
ఆ బొమ్మ ఎక్కడ ఉందో అడుగుతున్నాడు.

449
00:36:08,836 --> 00:36:09,837
విలియమ్.

450
00:36:14,758 --> 00:36:15,759
కుందేలు బొమ్మ ఇప్పుడు లేదు.

451
00:36:16,468 --> 00:36:18,303
అంటే? ఎక్కడ ఉంది అది?

452
00:36:18,303 --> 00:36:22,808
అది పాతబడిపోయింది, చిరిగిపోయింది,
అందుకని మేము దాన్ని పారేశాము.

453
00:36:22,808 --> 00:36:24,393
ఎందుకు పారేశారు?

454
00:36:24,393 --> 00:36:26,270
చూడు, నువ్వు మంచి పిల్లాడిలా మెలిగితే,

455
00:36:26,270 --> 00:36:28,605
క్రిస్మస్ తాతయ్య నీకు కొత్త బొమ్మ తెచ్చిస్తాడేమో.

456
00:36:28,605 --> 00:36:32,985
నాకు కొత్త బొమ్మ ఏమీ వద్దు, నాకు
నా కుందేలే కావాలి. అది తప్ప నాకు ఇంకేమీ వద్దు.

457
00:37:03,056 --> 00:37:04,308
ఇది ఏ రోజు?

458
00:37:05,142 --> 00:37:07,186
ఓరి దేవుడా.

459
00:37:07,978 --> 00:37:09,354
అప్పుడే చలికాలం వచ్చేసిందా?

460
00:37:09,354 --> 00:37:11,190
నేను మరీ చాలా కాలం నిద్రపోయినట్టున్నాను.

461
00:37:13,275 --> 00:37:15,110
ఎవరు నువ్వు?

462
00:37:15,110 --> 00:37:19,948
నేను ఆటల గది ఫెయిరీని, కల్పనల మాయకి నేను ఇన్ ఛార్జిని.

463
00:37:20,741 --> 00:37:24,369
పాతబడిపోయిన, చిరిగిపోయిన,
ఇకపై అవసరం లేని బొమ్మలను

464
00:37:24,953 --> 00:37:26,955
చూసుకోవడమే నా పని.

465
00:37:28,749 --> 00:37:30,000
ఎందుకు ఏడుస్తున్నావు?

466
00:37:31,835 --> 00:37:36,381
నేను బుడ్డోడిని మిస్ అవుతాను, అందుకే బాధగా ఉంది.

467
00:37:36,924 --> 00:37:39,343
మళ్లీ ఇంకెప్పుడూ అతనితో నేను ఆడుకోలేను.

468
00:37:41,011 --> 00:37:45,057
అతను నన్ను ప్రేమిస్తే, నిజమైన కుందేలు
అయిపోతానని అనుకున్నా, అందుకు కూడా బాధగా ఉంది.

469
00:37:47,768 --> 00:37:49,811
కానీ అతను నన్ను ప్రేమించనే లేదేమో.

470
00:37:49,811 --> 00:37:51,688
అతను నిన్ను చాలా ప్రేమించాడు.

471
00:37:52,397 --> 00:37:57,277
బాబోయ్, నీపై అతనికి ఉన్నంత ప్రేమని
మాటల్లో వర్ణించడం సాధ్యపడదు.

472
00:37:57,277 --> 00:37:59,947
అయితే, నేనెందుకు నిజమైన కుందేలు అయిపోలేదు?

473
00:38:00,489 --> 00:38:03,659
నిన్ను ఒకరు ప్రేమించగానే నువ్వు అసలైన కుందేలు అయిపోవు.

474
00:38:04,493 --> 00:38:09,957
నిష్కపటమైన ప్రేమ, దయ చూపినప్పుడే
నువ్వు అసలైన కుందేలువి అవుతావు.

475
00:38:11,124 --> 00:38:12,876
నిన్న రాత్రి చూపావే, అలాగా.

476
00:38:15,128 --> 00:38:16,880
అయితే ఇప్పుడు నేను అసలైన కుందేలును అయిపోయానా?

477
00:38:18,882 --> 00:38:24,847
అదే నిజమైతే, నాకు బొచ్చు ఏది, సరైన కాళ్లు ఏవి?

478
00:38:25,764 --> 00:38:27,432
నేనెందుకు గెంతలేకపోతున్నాను?

479
00:38:27,933 --> 00:38:32,354
బాబోయ్, మీ బొమ్మలకి
ఈ ఐడియాలన్నీ ఎక్కడి నుండి వస్తాయ్?

480
00:38:33,021 --> 00:38:36,441
అసలైన కుందేలు అంటే నీ రూపాన్ని బట్టి ఉండదు.

481
00:38:37,025 --> 00:38:39,403
నీ హృదయంలో ఏముంది అన్నదే ఇక్కడ ముఖ్యం.

482
00:38:40,612 --> 00:38:44,032
నువ్వు బుడ్డోడిని ప్రేమించావు,
అతను కూడా నిన్ను ప్రేమించాడు.

483
00:38:45,075 --> 00:38:46,910
ఒకసారి నిన్ను నువ్వు చూసుకో.

484
00:38:47,619 --> 00:38:50,038
ప్రేమను పంచి పంచీ, ఏ అవస్థలో ఉన్నావో చూసుకో.

485
00:38:51,748 --> 00:38:54,376
ఇతర బొమ్మల్లో కొన్ని, నేను అందవికారంగా ఉన్నానని అంటున్నాయి.

486
00:38:55,335 --> 00:38:57,921
అయితే, వాటికి అందం అంటే ఏంటో తెలీదు.

487
00:38:59,131 --> 00:39:04,261
ఇప్పుడు, ఒక మంచి బొమ్మగా ఉన్నందుకు
నీకు ఒక కానుక తెచ్చాను.

488
00:39:39,254 --> 00:39:41,965
విలియమ్, సమయం ఎనిమిది అయింది.

489
00:39:42,925 --> 00:39:46,053
ఏడు గంటలవ్వగానే కిందికి వచ్చేస్తావు అనుకున్నా.

490
00:39:47,888 --> 00:39:50,390
భలేవాడివే. ఓసారి నవ్వు.

491
00:39:51,183 --> 00:39:52,351
ఇవాళ క్రిస్మస్.

492
00:39:52,851 --> 00:39:55,646
క్రిస్మస్ దినాన నవ్వాలి. అది నియమం.

493
00:39:56,897 --> 00:39:57,940
అంతే.

494
00:39:58,815 --> 00:40:00,400
ఇక కిందికి రా.

495
00:40:01,777 --> 00:40:04,196
చాలా బరువుగా ఉందే. లోపల ఏముందో ఏమో.

496
00:40:20,629 --> 00:40:23,549
కోటు, బూట్లు వేసుకొని దీన్ని బయటకు తీసుకెళ్లి ఆడుకోరాదూ?

497
00:40:24,049 --> 00:40:25,467
ఎగరవేయగలవేమో చూడు.

498
00:41:15,058 --> 00:41:16,268
హలో, కుందేలు.

499
00:42:09,738 --> 00:42:11,156
బై, కుందేలు.

500
00:42:14,701 --> 00:42:15,702
థ్యాంక్యూ.

501
00:42:36,765 --> 00:42:39,017
హలో, నా పేరు విలియమ్.

502
00:42:39,017 --> 00:42:40,561
ఆడకుందాం వస్తారా?

503
00:42:52,781 --> 00:42:54,241
మార్గరీ విలియమ్స్ రచించిన, విలియమ్ నికల్సన్ చిత్రాల రూపంలో

504
00:42:54,241 --> 00:42:55,492
సాయం అందించిన పుస్తకం ఆధారితమైనది

505
00:44:06,396 --> 00:44:08,398
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్



